మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 01, 2020 , 23:00:21

పులిదాడిలో ఎద్దు మృతి

పులిదాడిలో ఎద్దు మృతి

బెజ్జూర్‌: మండలంలోని అందుగుల గూడ సమీపంలో మల్లన్న గుట్ట వద్ద శనివారం పెద్దపులి దాడి చేసి కోడెను హతమార్చినట్లు రేంజ్‌ అధికారి కిరణ్‌ కుమార్‌ తెలిపారు. కుంటలమానెపల్లి ఎఫ్‌ఎస్‌వో వందన ఎనిమల్‌ ట్రాక్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.  ఈ మేరకు సంచనామా నిర్వహించారు. తనకు నష్ట పరిహారం ఇప్పించాలని బాధితుడు భీమయ్య అటవీ అధికారులను కోరారు. సిబ్బంది మహేశ్‌, లక్ష్మీనారాయణ, అశోక్‌, పాల్గొన్నారు. 


logo
>>>>>>