గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 22:59:47

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

బెజ్జూర్‌ : దివ్యాంగులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్‌ రవీందర్‌ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగుల క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేస్తున్న పింఛన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో రాజేందర్‌, జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కొసర్కార్‌ అనిల్‌తో కలిసి  క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  సర్పంచ్‌ తలండి తిరుపతి, దివ్యాంగుల సంఘం జిల్లా కార్యదర్శి బిజయ్‌ రాజ్‌, నాయకులు జావీద్‌ అలీఖాన్‌, మల్లేశ్‌, మండల ఇన్‌చార్జి వెంకటేశ్‌, పొర్తెటి దస్రు, కాంతారావ్‌, గణేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo