మంగళవారం 07 జూలై 2020
Komarambheem - Feb 01, 2020 , 04:07:57

నులిపురుగుల నిర్మూలనకు కృషి

నులిపురుగుల నిర్మూలనకు కృషి
  • 19 ఏళ్లలోపు వారందరికీ మాత్రలు వేయాలి n ఈ నెల 3 నుంచి డ్రాపౌట్‌ పిల్లలకు టీకాలు
  • జిల్లా ప్రత్యేకాధికారి ప్రతీక్‌ జైన్‌
  • డీఎంహెచ్‌వో బాలుతో కలిసి అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: నులిపురుగుల ని ర్మూలనకు కృషి చేయాలని జిల్లా ప్రత్యేక ఆధికారి ప్ర తీక్‌ జైన్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు తో కలసి సంబంధితశాఖల అధికారులతో శుక్రవా రం  జాతీయ నులిపురుగుల దినోత్సవంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నె ల 10 న నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జి ల్లాలోని కళాశాలలు,పాఠశాలలు,అంగన్‌వాడీ కేం ద్రాల్లో  ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారికి నులి పురుగుల నివారణ మాత్రలను వేయాలని సూచించా రు. ఐదేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, ఆపై వారికి పూర్తి మాత్ర వేయనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పిల్లలకు మాత్రలు వేయాలని సూచించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డ్రాపౌట్‌ పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం ‘ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నిర్మూలి ద్దాం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్‌రావు, డీడబ్ల్యూవో సా విత్రి, ఇంటర్మీడియట్‌ అధికారి గోపాల్‌, ప్రభుత్వ ప రీక్షల నిర్వహణాధికారి ఉదయ్‌బాబు పాల్గొన్నారు.


logo