బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 31, 2020 , 00:07:31

సఖీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

 సఖీ సేవలను  సద్వినియోగం చేసుకోవాలి

 రెబ్బెన: సఖీ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సఖీ సెంట్రల్‌ ఆడ్మినిస్ట్రేటర్‌ సౌజన్య కోరారు. మండలంలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కస్తూర్భా విద్యాలయం, ఐసీడీఎస్‌ సెక్టార్‌ కార్యాలయాలను సందర్శించారు. మహిళలకు అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందు కు ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బా ధిత మహిళలకు  సఖీ కేంద్రాల్లో వసతి కల్పించి తగు సలహాలు అందజేసి, పూర్తి స్థా యిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆపద సమయంలో సఖీ కేంద్రం  బాధిత మహిళల కు అండగా ఉంటుందన్నారు. 181, 100, 1098, 112 తదితర అత్యవసర నంబర్లకు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేయాలని కో రారు. వెంటనే సంబంధిత పోలీసులతో పాటు సఖీ సిబ్బంది  ఆపదలో ఉ న్నవారికి సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ తిరుపతమ్మ, సఖీ కౌన్సిలర్‌ సుమలత, ఐటీ అసిస్టెంట్‌ రుబీనా, తదితరులున్నారు.


logo
>>>>>>