మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 30, 2020 , 23:38:45

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

వాంకిడి: మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామశివారు లో సోమవారం రాత్రి జరిగిన సర్కేపల్లి వాసి కోవ జలపతి హత్యకు వివాహేతర సంబంధమే కారణమ ని పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రి మాండ్‌కు తరలించారు. ఈమేరకు వివరాలను సీఐ రాణా ప్రతాప్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించా రు.  కేడె గాం గ్రామానికి చెందిన ఆత్రం బొజ్జిరావు, కోవ జలపతి ఇద్దరు స్నేహితులు.  ఆరు నెలలుగా ఆ త్రం బొజ్జిరావు మొదటి భార్యతో జలపతి వివాహేత ర సంబంధం ఏర్పరుచుకున్నాడు. బొజ్జిరావు లేని సమయంలో ఇంటికి తరుచుగా వచ్చేవాడు. ఇది గమనించి జలపతిని పలుమార్లు బొజ్జిరావు మందలించాడు. అయినా వినిపించుకోలేదు. దీంతో జలపతిపై బొజ్జి రావు పగ పెంచుకున్నాడు. ఈ క్రమం లో పత్తి అమ్మేందుకు సోమవారం వాంకిడికి వెళ్లిన జలపతి, తిరిగి వెళ్తుండగా కలిశాడు. మాటలు కలిపి తనతో తీసుకెళ్లాడు. పథకం ప్రకారం జలపతికి అతిగా మద్యం తాగించాడు. ఆ తర్వాత ద్విచక్ర వా హనంపై లక్ష్మీపూర్‌ శివారుకు తీసుకెళ్లి కర్రలతో దాడి చేసి హత్య చేశాడు.  అతని వద్ద నున్న రూ.30వేలను తీసుకుని పరారైనట్లు సీఐ వెల్లడించారు. నిందితుడి ని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌,కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.


logo
>>>>>>