మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 30, 2020 , 23:37:52

కోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థపై గౌరవం

కోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థపై గౌరవం
  • ఎస్పీ మల్లారెడ్డి
  • పోలీసుల పనితీరుపై అభినందనలు

జైనూర్‌ : సమత కేసులో ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థ, చట్టాలపై ప్రజల్లో గౌరవం మరింత పెరుగుతుందని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. సమత దోషులకు మరణ శిక్ష విధించడంపై గురువారం జైనూర్‌ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో బతుకుదెరువుకోసం వచ్చిన మహిళపై నవంబర్‌ 24న సామూహిక లైంగికదాడి చేశారు. ఆపై కిరాతకంగా హతమార్చిన దోషులను అదుపులో తీసుకుని నేరం రుజువయ్యేలా కావాల్సిన సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్‌ రిపోర్టును కోర్టుకు అందించిన డీఎస్పీ సత్యనారాయణ, సీఐ జవ్వాజి సురేశ్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌ను అభినందించారు. వీరికీ అవార్డులు వచ్చేలా డీజీపీకి నివేదిస్తామని చెప్పారు. పోలీసులు కేవలం 37 రోజుల్లో కోర్టుకు కావాల్సిన అన్ని సా క్ష్యాధారాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. కోర్టు తీర్పుతో న్యాయ స్థా నం, పోలీసు వ్యవస్థ, చట్టాలపై నమ్మకం, గౌరవం పెరుగుతుందని చెప్పారు. సామూహిక లైంగికదాడి కింద యావజ్జీవ కారాగార శిక్ష, సెల్‌ఫోన్‌, వస్తువులు లాక్కోవడంపై మూడేళ్లు, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కింద మూడేళ్ల జైలు శిక్షతో పాటు పెనాల్టీ, హత్య కేసులో దోషులకు మరణ శిక్ష విధించినట్లు ఎస్పీ వివరించారు. సంఘటన జరిగిన 66 రోజుల్లోపు దోషులకు మరణ శిక్ష పడడంపై పోలీసులను అభినందించారు. జైనూర్‌, లింగాపూర్‌ ఎస్‌ఐలు తిరుపతి, వెంకటేశ్‌ ఉన్నారు.logo
>>>>>>