శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 30, 2020 , 03:48:48

భక్తిశ్రద్ధలతో జలదివాసం

భక్తిశ్రద్ధలతో జలదివాసం

బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి అర్చకులు అభిషేకం, మహాహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ తదితర పూజలు నిర్వహించారు. మన రాష్ట్రం నుంచే గాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తమ చిన్నారులకు అర్చకులచే అక్షరశ్రీకార పూజలు జరిపించారు. సు మారు 15వేల మంది భక్తులు బుధవారం ఒక్కరోజే దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు జరిగే ఉత్సవాల్లో ప్రభుత్వం తరపున అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. 

నేడు వసంత పంచమి..

అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రో జైన గురువారం భక్తులు తమ చిన్నారులకు అక్షరశ్రీకారా లు జరిపించడానికి భారీగా తరలిరానున్నారు. సుమారు 70వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. బుధవారం సాయంత్రానికి ఆలయ, ప్రైవేటు అతిథి గృహాలు నిండిపోయాయి. భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. టీఎస్‌ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. 

భారీగా అక్షరాభ్యాసాలు

వసంత పంచమి ఉత్సవాల్లో రెండోరోజు భారీగా అక్షరాభ్యాసాలు జరిగాయి. వెయ్యి రూపాయల అక్షరాభ్యాసాలు 883, రూ. 100 అక్షరభ్యాసాలు 686, మొత్తం 1569 అక్షరాభ్యాసాలు జరిగాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 15లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. 

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

గురువారం వసంత పంచమి సందర్భంగా బాసరకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రంఎస్పీ శశిధర్‌రాజ్‌ బందోబస్తుల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూ లైన్లు, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు సక్రమంగా చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ నర్సింగ్‌రావు, ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, బాసర ఎస్సై రాజు, తానూర్‌ ఎస్సై రాజన్న, తదితరులున్నారు. logo