సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 30, 2020 , 03:41:17

రామన్నను కలిసిన మున్సిపల్‌ పాలకవర్గం

రామన్నను కలిసిన మున్సిపల్‌ పాలకవర్గం

కాగజ్‌నగర్‌ టౌన్‌: హైదరాబాద్‌లోని తెలంగాణ  భవన్‌లో బుధవారం సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ నూతన పాలకవర్గం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏకపక్షంగా విజయం సాధించినందుకుగాను ఎమ్మెల్యే కోనప్పతో పాటు పాలకవర్గ సభ్యులను కేటీఆర్‌ అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ రాచకొండ గిరీష్‌కుమార్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.    


logo