గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 29, 2020 , 03:25:18

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

దహెగాం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం రోడ్లు, వంతెన నిర్మాణాలు చేపడుతున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు మంగళవారం భూమి పూజ చేశారు. ముందుగా బీబ్రా గ్రామ పంచాయతీ పరిధి దేవాజీగూడ సమీపంలోని డోర్మల్లి వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం పీఎంజీఎస్‌వై నిధుల(రూ.50లక్షలు)తో బోర్లకుంట కొత్తగూడ రోడ్డు రెన్యువల్‌ బీటీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే ఆర్‌అండ్‌బీ నిధులు రూ.కోటి 10 లక్షలతో ఐనం నుంచి దహెగాం రెన్యువల్‌ బీటీ నిర్మాణ పనులు, పీఎంజీఎస్‌వై నిధులు రూ.కోటి 12 లక్షలతో పీపీరావ్‌ కాలనీ నుంచి  చేపడుతున్న రెన్యువల్‌ బీటీ నిర్మాణ పనులతో పాటు దహెగాం నుంచి కల్వాడకు రూ.కోటి 50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా శాశ్వత రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నదని చెప్పారు. అధికారులు నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణాలను గడువులోగా చేపట్టి అందుబాటులోకి తీసుకరావాలన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించి, త్వరగా పూర్తయ్యేందుకు తోడ్పాటునందించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో రూ.2కోట్ల 5లక్షలతో నిర్మించనున్న అదనపు భవనం పనులను ప్రారంభించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భవన నిర్మాణంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ సహాయసహకారాలతో నియోజకవర్గంలో ఎన్నో విద్యాలయాలతో పాటు రోడ్లు, పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కంబగౌని సులోచన, జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కంబగౌని సంతోశ్‌ గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ కోండ్ర తిరుపతి గౌడ్‌, ఆత్మ చైర్మన్‌ కొముర గౌడ్‌, సర్పంచులు వశాక మురారి, రత్నం మధుకర్‌, దండ కృష్ణ, ఎల్ములె జయేందర్‌, పుప్పాల లక్ష్మి, ఆయిల్ల శంకర్‌, ఎంపీటీసీలు రాంటెంకి శంకర్‌, రాపర్తి జయలక్ష్మి, బండి రాజేశ్వరి, డీఈలు రామ్మోహన్‌, అంకులు, ఏఈలు రాజ్‌మార్‌ సింగ్‌, ఆత్మారాం, కేజీబీవీ ఎస్‌వో రామదేవి, నాయకులు గంగాధర్‌ గౌడ్‌, దామోదర్‌ గౌడ్‌, దందెర వెంకన్న, పుప్పాల సంతోశ్‌, తుమ్మిడె పాపయ్య, గొడిషెల శంకర్‌ గౌడ్‌, పుప్పాల శ్రీనివాస్‌, కాసారం నాగేశ్వర్‌ గౌడ్‌, అల్గం మల్లేశ్‌, నజీర్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo