మంగళవారం 07 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 29, 2020 , 03:24:41

కంటి చూపును కాపాడుకోవాలి

కంటి చూపును కాపాడుకోవాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : అందరూ తమ కంటిచూపు కాపాడుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన ఆ ధ్వర్యంలో మంగళవారం మండలంలోని మోవాడ్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రా రంభించి, మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పౌష్ఠికాహార లో పంతో చాలా మంది కంటిచూపు కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 60 మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. 40 మందిని ఆదిలాబాద్‌ తీసుకెళ్లి, ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యుడు అలీబిన్‌హైమద్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, ఎంపీటీసీ లింగు, సర్పంచులు వరలక్ష్మి, కౌసల్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఆధ్యక్షుడు కర్ణగౌడ్‌, గుర్రాల వెంకటేశ్వర్లు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా స్ఫూర్తితో రాణించాలి..

రెబ్బెన : క్రీడాస్ఫూర్తితో రాణించి, పతకాలు సాధించాలని ఎమ్మెల్యే అత్రం సక్కు క్రీడాకారులకు సూచించారు. మండల కేంద్రంలో దుర్గం తిరుపతి(జాంటి) స్మారక క్రికెట్‌ టోర్నీని ప్రా రంభించారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దా రుఢ్యం కలుగుతుందన్నారు. గెలుపోటములు సాధారణమనీ, స్నేహపూర్వకమైన వాతావరణంలో క్రీడలు అడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వే ముర్ల సంతోశ్‌, సర్పంచ్‌ బొమ్మినేని అహల్యాదేవి, ఉప సర్పంచ్‌ బొమ్మినేని శ్రీధర్‌, ఎంపీటీసీ పెసరి మధునయ్య, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, కో ఆప్షన్‌మెంబర్‌ జౌరొద్దీన్‌, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ వోల్వోజి వెంకటాచారి, మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాశ్‌రావు, నాయకులు నవీన్‌కుమార్‌జైస్వాల్‌, పందిర్ల మధునయ్య, మోడెం సుదర్శన్‌గౌడ్‌, బొమ్మినేని శ్రీధర్‌, దుర్గం రాజేశ్‌, రంగు మహేశ్‌గౌడ్‌, శాంతికుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo