బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 , 23:43:30

అతివేగం ప్రమాదకరం

అతివేగం ప్రమాదకరం

ఆసిఫాబాద్‌టౌన్‌ :  అతివేగం ప్రమాదకరమని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హ న్మంతు అన్నారు. పట్టణంలోని రోజ్‌ గార్డెన్‌లో సోమవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ చౌక్‌ నుంచి  విద్యార్థులు, డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. అనం తరం ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ 18ఏళ్లు నిండి వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ తో పా టు వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు త ప్పనిసరిగా వెం ట ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా రవాణా అధికారి శ్యాంనాయక్‌ మాట్లాడుతూ లైసెన్స్‌తో పాటు పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించా రు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలు విడుదల చేశారు. ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ, పంచాయితీ రాజ్‌ ఈఈ రా ములు, డీఎం మూర్తి, లయన్స్‌క్లబ్‌ సభ్యుడు పీచు వెంకటరమణరెడ్డి, ఎంవీఐ ఉమామహేశ్వర్‌రావు, సిబ్బంది లింగమూర్తి, శోభన్‌బాబు, హరిందర్‌కుమార్‌, మహ్మద్‌సందాని, చంద్రశేఖర్‌, కవిత, ఏవో అరుణబాయి, విద్యార్థులు, డ్రైవర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.logo