బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 , 23:41:45

వైభవంగా మార్కండేయ జయంతి

వైభవంగా మార్కండేయ జయంతి
  • ఆసిఫాబాద్‌, రెబ్బెనలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
  • భక్తి శ్రద్ధలతో పురవీధుల్లో శోభాయాత్ర

ఆసిఫాబాద్‌. నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని నదీతీర ఆలయంలో శ్రీ భక్త మా ర్కండేయ జయంతి  సోమవారం  అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేస్తూ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో  శోభాయాత్ర చేపట్టారు.  ఆలయం వద్ద పండితులు సంతోష్‌ శర్మ ఆధ్వర్యంలో హోమం, ధ్వ జారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజాకార్యక్రమం అ నంతరం అన్నదానం చేశారు. శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.  పద్మశాలీలు చెన్నూరి అశోక్‌, బండి శ్రీనివాస్‌, కొమటి పల్లి లింగయ్య, వనమాల ధర్మయ్య, జంజిరాల శ్రీనివాస్‌, ఇరుకుల్ల అంజనేయులు, గాజర్ల వెంకటేశ్వర్లు, గుండా శంకర్‌, అనుమండ్ల శ్రీకాంత్‌, చందు, రమేశ్‌, గాజర్ల శైలేందర్‌, చిప్ప సురేశ్‌, తిరుపతి, మహేశ్‌, రవీందర్‌, సరస్వతి, సునిత, జయ తదితరులు పాల్గొన్నారు.


రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామంలో పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సో మవారం భక్త మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయం వద్ద పూజలు చేశారు. సొసైటీ ప్రధానకార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. సభ్యులు అంకం కైలాసం, బోగే ఉపేందర్‌, హనుమండ్ల సత్యనారాయణ, మిట్టకొల్ల వెంకటనారాయణ, పరికిపండ్ల సంపత్‌కుమార్‌ 


logo