సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 , 23:40:52

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌ జెండా

కార్మికులకు అండగా టీబీజీకేఎస్‌ జెండా

బెల్లంపల్లి,నమస్తే తెలంగాణ:  టీబీజీకేఎస్‌ జెండా కార్మికులకు అండగా ఉంటుందని  ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ అన్నారు. బెల్లంపల్లిలో టీబీజీకేఎస్‌ ఆవిర్భావ సంబురాలు సోమవారం ఘనంగా జరిపారు. స్థానిక టీబీజీకేఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ కేక్‌కట్‌చేశారు. కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్‌ జెండా ఎగురవేసి మాట్లాడారు. సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో టీబీజీకేఎస్‌ చేసిన కృషి మరులేదన్నారు. సింగరేణి పరిరక్షణతోపాటు కార్మికుల పిల్లలకు కారుణ్యం పేరిట ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలోబెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, మార్కెట్‌ చైర్మన్‌ సిలువేరు నర్సింగం పాల్గొన్నారు.

మందమర్రిలో..

మందమర్రి రూరల్‌ : మందమర్రి ఏరియాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ మార్కెట్‌ పాంతంలోని యూనియన్‌ కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగురవేశారు. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ చిత్రపటానికి పూల మాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బడికెల సంపత్‌ కుమార్‌, ఇప్ప సమ్మయ్య, మద్దెల శంకర్‌, భూపల్లి కనకయ్య, పిట్‌ కార్యదర్శులు తిరుపతి, కృష్ణ, రాజ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లేశ్‌, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. 

కాసిపేట

కాసిపేట : మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి దుగుట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గనులపై టీబీజీకేఎస్‌ జెండాలు  ఎగుర వేశారు. కార్మికుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్మికులు మొత్తం టీబీజీకేఎస్‌ పక్షానే ఉన్నారని శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు సమ్మయ్య, బానోత్‌ తిరుపతి, బెల్లం అశోక్‌, దొబ్బటి రమేశ్‌, బండారి రమేశ్‌, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, పెండ్యాల నర్సయ్య, అఫ్జలొద్దీన్‌ పాల్గొన్నారు. 

కాసిపేట 2 ఇైంక్లెన్‌పై .. 

కాసిపేట 2 ఇైంక్లెన్‌ గనిపై కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాసిపేట 2 గని పిట్‌ కార్యదర్శి కారుకూరి తిరుపతి, నాయకులు కోడూరి మునేందర్‌, శ్రవణ్‌, రాంచందర్‌, పర్వతాలు పాల్గొన్నారు. 

గోలేటిలో .. 

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం  కార్యాలయంలో టీబీజీకేఎస్‌ జెండాను బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు ఎగురవేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేతుల మీదుగా ఏర్పాటైన టీబీజీకేఎస్‌ యూనియన్‌ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిందన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ కేంద్ర కమిటీ చీఫ్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, ఏరియా కార్యదర్శి రాంరెడ్డి, జీఎం కార్యాలయ పిట్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు మిట్టపల్లి కుమార్‌, రమేశ్‌, మహేశ్‌, షర్ఫొద్దీన్‌, సుగ్రీవులు, వెంకటేశ్‌, దేవేందర్‌, హరిసింగ్‌, పలువురు పాల్గొన్నారు. 


logo