శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 ,

గణంగా.. తిరంగా..

గణంగా.. తిరంగా..
  • పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జెండా ఎగరేసిన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
  • హాజరైన ఎస్పీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు జెండా ఎగరేశారు. అంతకుముందు ఆయన పోలీస్‌ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎస్పీమల్లారెడ్డి, జేసీ రాంబాబు హాజరయ్యారు.  విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు తిలకించారు. శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉన్నతాధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి మంజూరైన ఆస్తులను లబ్ధిదారులకు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జేసీ రాంబాబు, జిల్లా న్యాయస్థానంలో జడ్జి నారాయణ బాబు, పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాంబాబు జెండా ఎగరేశారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.  రెబ్బెన మండలంలోని గోలేటి భీమన్న మైదానంలో వేడుకలు నిర్వహించారు.


logo