శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 ,

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేడే

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేడే
  • అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షులు..
  • ఏర్పాట్లు పరిశీలించిన ప్రత్యేకాధికారి వేణు, కమిషనర్‌ తిరుపతి
  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు సద్దాం హుస్సేన్‌, గిరీష్‌కుమార్‌ ఖరారు!
  • కొలువుదీరనున్న 9వ పాలక వర్గం

కాగజ్‌నగర్‌టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ నూత న పాలవర్గం సోమవారం కొలువుదీరనున్నది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికతో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఇందుకోసం కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారి వేణు, కమిషనర్‌ తిరుపతి ఆదివారం ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 11.30 గం టలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ఉంటుంది. బల్దియాలోని 30 వార్డులకు ఎన్నికలు జరుగగా, 22 టీఆర్‌ఎస్‌ అభ్యర్థు లు, ఆరుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందిన విషయం తెలిసిందే.


చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఖరారైనట్లు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివారం తెలిపారు. శనివారం వెలువడ్డ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కౌన్సిల్‌లో తిరుగులేని మెజార్టీ సాధించింది. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎంపిక కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కౌన్సిలర్లతో మంతనాలు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అదే రోజు రాత్రి ఆశావాహులుగా ఉన్న కౌన్సిలర్లు సద్దాం హుస్సేన్‌, రాచకొండ గిరీష్‌తో పాటు పలువురు ముఖ్యనాయకులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ మేరకు ఆదివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై గురించి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు చైర్మన్‌గా ఒకటో వార్డు నుంచి గెలుపొందిన సద్దాం హుస్సేన్‌, 21 వార్డు నుంచి గెలిచిన రాచకొండ గిరీష్‌కుమార్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్నది. సద్దాం హుస్సేన్‌ ఇప్పటికే వైస్‌ చైర్మన్‌గా పని చేయగా, గిరీష్‌ కుమార్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు.


కొలువుదీరనున్న 9వ పాలకవర్గం

జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో తొమ్మిదో పాలకవర్గం కొలువుదీరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 30 వార్డులకుగాను 22 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక లాంఛనమే కానున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.


పారని ప్రతిపక్షల పాచికలు

కాగజ్‌నరగ్‌ మున్సిపాలిటీలో గెలుపు కోసం ప్రతిపక్షాల చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పని చేశారు. ఆయన సోదరుడు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కోనేరు ట్రస్టు చైర్మన్‌ వంశీతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారంలో భాగస్వాములయ్యారు. టీఆర్‌ఎస్‌ హయాంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పట్టణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు.


logo