శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 28, 2020 ,

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. జిల్లాలోని ప్రగతి పనులను ప్రస్తావించారు. జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా జిల్లాలో 334 గ్రామ పంచాయతీలకు పల్లెప్రగతి లో సెప్టెంబర్‌ 2019, జనవరి 2020 నెల వరకు రూ.40 కోట్ల 46 లక్షలు విడుదల చేశామన్నారు. 199 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేశామనీ, మిగతా 135 గ్రామ పంచాయతీలకు బ్యాంకు రుణం ద్వారా అందజేశామని తెలిపారు. 


అన్నదాతల అభ్యున్నతికి కృషి..

వ్యవసాయ శాఖ ద్వారా రైతుబంధు పథకంలో 2019 ఖరీఫ్‌లో లక్షా ఒక వెయ్యి 873 మంది రైతులకు గాను 79,189 మంది ఖాతాల్లో రూ.126.86 కోట్లు జమ చేశామన్నారు. రైతు బీమా ద్వారా 2019లో 147 మంది రైతులు మరణించగా 127 మందికి రైతు కుటుంబాలకు రూ.6.35 కోట్లు ఇన్సూరెన్స్‌ ఇచ్చామని చెప్పారు. 


2018 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 8724 మంది రైతులు నష్టపోగా వారి ఖాతాల్లో రూ. 3.11 కోట్లు జమ చేశామన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలో అమలవుతున్న నాలుగు ముఖ్యమైన పథకాలను జిల్లాలోని రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పట్టుపరిశ్రమపై ఆధారపడి 365 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 28.75 ఎకరాల విస్తీర్ణంలో మామిడి, సీతాఫలం, జామ, నూతన పండ్ల తోటల పెంపకం చేపట్టామని చెప్పారు. ఇందుకుగాను పండ్ల తోటలు సాగు చేసుకున్న రైతులకు రూ.లక్షా 89 వేలు సబ్సిడీగా అందజేశామన్నారు. మత్స్య శాఖ ద్వారా జిల్లాలోని 492 నీటి వరనరులలో 3381.30 హెక్టర్ల వీస్తిరం కలిగి ఉందన్నారు. 10 వేల మత్స్యరుల జనాభాలో 5 వేల మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. 19 సహకార సంఘాలు రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. 500 మంది లైసెన్స్‌ పొంది చేపల వేట చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019-20 సంవత్సరంలో 40 చెరువులు, నాలుగు రిజర్వాయర్లు లీజుకు ఇచ్చామన్నారు. ఈ ఏడాది 458 మంది మత్స్య కారులకు లైసెన్సులు మంజూరు చేసి రూ.లక్షా 68,450 ప్రభుత్వ ఖాతాలో జమ చేశామని పేర్కొన్నారు. 125 లక్షల చేపపిల్లలు వందశాతం సబ్సిడీపై విడుదల చేశామన్నారు. ఇందుకుగాను 107.97లక్షలతో 233 చెరువులలో 57.63 లక్షలు,13 రిజర్వాయర్లలో 65.59 లక్షల చేప పిల్లలు విడుదల చేశామన్నారు. సమీకృత మత్య్సాభివృద్ధి పథకం ద్వారా రూ. 250.36 లక్షలతో 390 మంది మత్స్యకారులకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాలను ,ఐస్‌బాక్స్‌లు, కాంటాలను పంపిణీ చేశామని తెలిపారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది 66.6 లక్షల మొక్కలు నాటగా ఈ ఏడాది 16 లక్షల మొక్కలను హారితహారంలో నాటమని తెలిపారు. 


పులులు, రాబంధుల రక్షణపై దృష్టి..

జిల్లాలో పులులు, రాబంధులకు సంబంధించి వన్యపాణి సంరక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. పంచాయితీ రాజ్‌ శాఖ ద్వారా 2248.39 కిలోమిటర్ల రోడ్డు మైలేజి ఉంది. ఇందులో జిల్లా మినరల్‌ ట్రస్టు ఫండ్‌ 2019-20 సంవత్సరంలో రూ. 2645 లక్షలతో 26 బీటీ రోడ్లకు బీటీ రెన్యువల్‌ పనులు మంజూరు కాగా అన్ని పనులు టెండర్‌ దశలో ఉన్నాయని తెలిపారు. 2019-20 సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద 258 శ్మశానవాటికల నిర్మాణానికి రూ. 3250.80 లక్షలు మంజూరు కాగా 143 పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. సిర్పూర్‌ నియోజవర్గంలోని 12 బ్రిడ్జిలకు గాను మొత్తం రూ. 2700 లక్షలు మంజూరు చేశామన్నారు. అన్ని పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. డబుల్‌ బెడ్రూం పథకంలో 1223 ఇండ్లకు టెండర్‌ పిలువగా 558 ఇండ్లకు అగ్రిమెంట్‌ అయినట్లు తెలిపారు. అర్‌ఆండ్‌బీ శాఖలో వివిధ పథకాల కింద మొత్తం 30 పనులకు రూ.435 కోట్లు మంజూరు కాగా, అందులో రోడ్ల పనులు 13 ఉండాగా ఒకటి పూర్తయిందన్నారు. 12 బ్రిడ్జి పనుల్లో 8 పూర్తయినట్లు తెలిపారు. ఆరోఖ్య శాఖ ద్వారా మాతా శిశు సంరక్షణలో భాగంగా జూన్‌ 2017-2019 నవంబర్‌ వరకు 8,052 మంది గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. దీంతో రూ. 8 కోట్ల 66 లక్షల 13 వేలు ఆర్థిక సహాయంగా అందించడం జరిగిందన్నారు. 1058 మంది క్షయవ్యాధిగ్రస్తులకు 29 లక్షల 43 వేల 500 రూపాయలు అందజేశమన్నారు. 277 మంది గిరిజన క్షయ వ్యాధిగ్రస్తులకు రూ.6లక్షల 35 వేల 750 అందించడం జరుగుతుంనద్నారు. 484 మంది బోధకాల వ్యాధి గ్రస్తులకు రూ. 9లక్షల 75వేల 744 ప్రతి నెల ఆసరా పింఛన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. 595 గ్రామల్లో లక్షా 41 వేల 594 మంది మెడికెటేడ్‌ దోమతెరలను, ఆశ్రమ పాఠశాలల్లో 8,815 , గిరిజన సంక్షేమ వసతి గృహల్లో 2,724 దొమతెరలను పంపిణీ చేశమన్నారు. ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. షాదీముబారక్‌ , కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2019-20 సంవత్సరంలో 4804 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 2506 మందికి రూ.లక్షా ఒక వెయ్యి 116 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో 1057 అవాసాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా 118 మందికి ఉపాధి కల్పించేందుకు అనుమతులు పొందామని పేర్కొన్నారు.


logo