శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 27, 2020 ,

కన్నుల పండువగా శ్రీవారి కల్యాణం

కన్నుల పండువగా శ్రీవారి కల్యాణం

కెరమెరి: మండలంలోని అనార్‌పల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవారం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో పట్టువస్ర్తాలను ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం పండితులు సంతోష్‌శర్మ, తిరుపతిల వేదమంత్రాల నడుమ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల కల్యాణం జరిపించి, మాలధారణ అనంతరం తలంబ్రాలు వేశారు. అనంతరం అభిషేకం, నూతనవస్త్రలతో అలంకరణ చేసి కర్పూరహారతి పూజ చేశారు. భక్తులు పూజలు చేసి కానుకలను సమర్పించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. నిర్వహకులు రూప్‌చంద్‌ నాయక్‌, గోపానాయక్‌, కిష్టనాయక్‌, స్థానిక నాయకులు గోవింద్‌నాయక్‌, శేషరావ్‌, శంకర్‌ భక్తులు తదితరులు పాల్గొన్నారు.  logo