శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 29, 2020 ,

చెత్తబుట్టల పంపిణీ

చెత్తబుట్టల పంపిణీ

బెజ్జూర్‌ : మండలంలోని సులుగుపల్లి, అందుగులగూడలో ఆదివారం ఎంపీపీ రోజారమణి సర్పంచులు కర్పెత స్వప్న, కుంరం హన్మంతులతో కలిసి గ్రామస్తులకు చెత్తబుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్లలోని చెత్త ను రోడ్డుపై వేయకుండా తడి, పొడి బుట్టల్లో వే యాలని సూచించారు. అదే విధంగా కుంటలమానేపల్లిలో సర్పంచ్‌ విజయ్‌, ముంజంపల్లిలో స ర్పంచ్‌ చాపిలె కళావతి ప్రజలకు చెత్తబుట్టలను అందజేశారు. ఎంపీడీవో రాజేందర్‌, ఎంపీవో రమేశ్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అర్షద్‌ హుస్సేన్‌, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్‌, డోకె వెంకన్న, పుల్లూరి సతీశ్‌ కుమార్‌, కార్యదర్శులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 


logo