సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 26, 2020 , 00:32:52

కౌంటింగ్‌ ప్రశాంతం

కౌంటింగ్‌ ప్రశాంతం
  • - ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  • - మధ్యాహ్నాం 1.30 గంటలకు ఫలితాలు వెల్లడి
  • -పర్యవేక్షించిన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు
  • - ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు

కాగజ్‌నగర్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కిం పు పట్టణంలోని ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్‌ హాలులో 5 గదులను ఏర్పాటు చేసి 1వ గదిలో 1 నుంచి 6 వార్డులు, 2వ గదిలో 7 నుంచి 12 వార్డులు, 3వ గదిలో 13 నుండి 18 వరకు, 4వ గదిలో 19 నుండి 24 వరకు, 5వ గదిలో 25 నుండి 30 వరకు వార్డుల వారీగా లె క్కింపు చేపట్టారు. కౌంటింగ్‌ నిర్వహించేందుకు 100 మంది సిబ్బంది, 10 ఆర్వో,10ఏఆర్వో, 30 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు కౌంటింగ్‌లో పా ల్గొన్నారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, జేసీ రాంబాబు, ఏఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మొదటగా రెండో వా ర్డు నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పూనం మల్హోత్ర విజయం సాధించినట్లు అధికారులు ఫలితాన్ని వెలువరించారు. 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ మధ్యాహ్నం 1.30 వరకు మూడు రౌండ్లలో పూర్తి చేశారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. 

భారీ బందోబస్తు

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల ఆవరణలో భారీ బందోబస్తును ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా రెండు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 500 మీటర్ల దూరంలో కౌంటింగ్‌ కేంద్రానికి ఉండేలా సూచనలు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు వచ్చే ప్రతీ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.అభివృద్ధికే పట్టం కట్టారు


-  ప్రజలే మా బలం 
-  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 
-  గెలుపొందిన వారికి ఘన సన్మానం

కాగజ్‌నగర్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ తరుపున 22 వార్డుల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే నివాసంలో శనివారం పూలమాలలతో సన్మానించారు. మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ అభివృద్ధి కోసం రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు కేటాయించారనీ, రూ.10 కోట్ల పనులు పూర్తి కాగా రూ. 15 కోట్ల పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రజలే మా బలమనీ, అందుకే వారు మా పక్షాన నిలిచారని పేర్కొన్నారు. ఈనెల 27న చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక అధిష్ఠానం ప్రకటించనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా పార్టీ తరుపున గెలిచిన కౌన్సిలర్లు చూసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులు, తదితరులున్నారు.logo