గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 26, 2020 , 00:29:51

విజయ సారథి కోనప్ప

విజయ సారథి కోనప్ప
  • -ప్రతి ఎన్నికల్లోనూ తన మార్కు చూపుతున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే
  • -వరుస ఎన్నికల్లో పార్టీ విజయంలో ప్రధాన పాత్ర
  • -అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల అమలులో ఆయనే కీలకం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్‌ విజయానికి వ్యూహకర్త పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అయితే,ఆ వ్యూహాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయడంలో కోనేరు కోనప్ప తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు.. సిర్పూర్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో భారీ విజయాన్ని సాధించిన కోనేరు కోనప్ప తరువాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌  పార్టీ గెలుపును శాశ్వతం చేశారు. గ్రామ పంచాయతీలను మొదలుకొని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో విజయాన్ని చేకూర్చేలా వ్యూహాలను అమలు చేస్తూ తేలికగా విజయాలను అందిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో  అర్హులకు అందించడం, అభివృద్ధి పథకాలను పాదర్శకంగా అమలు చేయడంలో ఏ మాత్రం వెనుకాడకుండా నిక్కచ్చిగా ఉండడం కోనప్ప నైజం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాకుండా తను వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేస్తూ నియోజకవర్గ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించారు. ఎన్నికల్లో సాధించే విజయాలకు... టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీలో ఉండే అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలను రచిస్తూ వాటిని అమలు చేసి విజయాన్ని సాధిస్తున్నారు.

చైర్మన్‌ ఎన్నికకు సిద్ధం..

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఈనెల 27న జరుగున్న చైర్మన్‌ ఎన్నికకు సిద్ధమవుతోంది. 22 స్థానాలను స్థానాలను గెలుపొందడంతో  ఇతర పార్టీల మద్దతు లేకుండానే  చైర్మన్‌ పదవిని తన ఖాతాలో వేసుకుంది. కాగజ్‌నగర్‌ మున్సిల్‌ చైర్మన్‌ జనరల్‌కు రిజర్వు కావడంతో మున్సిపాలిటీలో జనరల్‌ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల్లో ఎవరినీ చైర్మన్‌గా ఎన్నుకోవాలనే దానిపై వ్యూహాలు చేస్తున్నారు. గెలుపొందిన అభ్యర్థులు చైర్మన్‌ అభ్యర్థిని ఈనెల 27న జరుగనున్న పరోక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో ఎన్నుకోనున్నారు.


logo
>>>>>>