ఆదివారం 24 మే 2020
Komarambheem - Jan 25, 2020 , 00:38:39

‘పుర’ ఫలితాలు నేడే

‘పుర’ ఫలితాలు నేడే
  • - ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు
  • - ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలోని 5 గదుల్లో 30 టేబుళ్లు
  • - కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు
  • - ఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు

కాగజ్‌నగర్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఒకే ఒక కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బుధవారం ఎన్నిక లు జరిగాయి. 124 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 45,161 ఓట్లకుగాను 31,137 ఓట్లు పోలయ్యాయి. 69.09 శాతం పోలింగ్‌ నమోదైంది. నే డు ఫలితాలు వెలువడనుండగా, అదృష్టం ఎవ్వరిని వరిస్తుందోనన్న టెన్షన్‌ అభ్యర్థుల్లో మొదలైంది.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో ఈ నెల 22న ఎన్నికలు జరుగగా, పట్టణంలోని త్రిశూల్‌పహాడ్‌ ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం 100 మంది సిబ్బందితో పాటు 10 మంది ఆర్వో, 10 ఏఆర్వోలు, 30 మంది సూపర్‌వైజర్లను నియమించారు. 5 గదుల్లో 30 టేబుళ్లను ఏర్పాటు చేశా రు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు ప్రారంభం కానున్నది. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు, ఎస్పీ మల్లారెడ్డి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఏజెంట్లకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక వసతులు

కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యేక వసతులు ఏర్పా టు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు రావడానికి ఒకవైపు నుంచి, అధికారులు, సిబ్బంది రావడానికి మరో వైపు నుంచి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాన్ని కేటా యించారు. కౌంటింగ్‌ సిబ్బందికి మధ్యాహ్న భోజ న వసతి కల్పిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు.

మూడు గంటల్లోపే ఫలితాలు

పురపాలక సంఘం పరిధిలోని మొత్తం వార్డుల ఫలితాలు త్వరగానే వెలువడనున్నట్లు తెలుస్తుంది. కౌంటింగ్‌ హాల్‌-1లో 1, 2, 3, 4, 5, 6 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ హాల్‌-2లో 7, 8, 9, 10, 11, 12 వా ర్డులకు, కౌంటింగ్‌ హాల్‌-3లో 13, 14, 15, 16, 17, 18 వార్డులకు, కౌంటింగ్‌ హాల్‌-4లో 19, 20, 21, 22, 23, 24 వార్డులకు, కౌంటింగ్‌ హా ల్‌-5లో 25, 26, 27, 28, 29, 30 వార్డులకు సంబంధించిన ఓట్లు లెక్కించనున్నారు. ప్రతి 25 ఓట్లకు ఒక కట్ట ను ఏర్పాటు చేస్తారు. కట్టలు పూర్తయిన తర్వాత అభ్యర్థుల వారీగా విడదీయనున్నా రు. మళ్లీ అభ్యర్థుల వారీగా 100 ఓట్లకు ఒక కట్టను కట్టి తదుపరి లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకే ఈ లెక్కిం పు ప్రారంభం కానుండగా, మూడు గంటల్లోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

పురపాలక సంఘం పరిధిలోని 30 వార్డుల్లో 124 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్‌ పూర్తవ్వడమేగాకుండా అభ్యర్థుల భవితవ్యం, బ్యా లెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమై ఉండగా ఫలితంపై తీవ్ర ఉ త్కంఠ నెలకొంది. ఇప్పటికే ఫలితాలపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. పురపాలక సం ఘం పరిధిలోని వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు పై కూడా జోరుగా చర్చ జరగుతుంది. శనివారం ఉదయంలోగా ఫలితాలు వెలువడనున్నాయి.
logo