మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 25, 2020 , 00:37:35

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌

చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌
  • - విద్యార్థినులు పోటీతత్వాన్ని అవర్చుకోవాలి
  • - సమయాన్ని వృథా చేసుకోవద్దు
  • - జిల్లా విద్యాశాఖాధికారి పాణిని
  • -కెరమెరి కేజీబీవీలో జాతీయ బాలికా దినోత్సవం
  • - కాగజ్‌నగర్‌లో పాల్గొన్న జడ్పీ సీఈవో వేణు


కెరమెరి : చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని జిల్లా విద్యాధికారి పాణిని అన్నారు. శుక్రవారం కేజీబీవీలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కోఆపరేటివ్‌ అధికారి డీ కృష్ణ, ఎంపీడీవో మహేందర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశభవిష్యత్తు విద్యార్థులపైనే ఉందనీ, సమయాని వృథా చేయకుండా సద్వినియోగం చేయాలన్నారు. అన్ని రంగాల్లో బాలికలు పోటీతత్వాని అలవర్చుకుంటూ ముందుస్థాయిలో నిలవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రాష్ర్టాల వేశాధారణ, సంస్కృతి, సంప్రదాయలు, జీవన విధానంపై ప్రదర్శన నిర్వహించా రు. దీంతో పాటు పర్యావరణం ఆవశక్యతను తెలిపేలా మొక్కలు నాటడం, చెట్లు ప్రాధాన్యతపై నా టిక ప్రదర్శించారు. అంతకు ముందు నిర్వహించిన క్విజ్‌, బాలికా సాధికారత ఉపన్యాస పోటీలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు.కేజీబీవీ ప్రత్యేకాధికారి మీనా, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
కాగజ్‌నగర్‌ రూరల్‌ : మండలంలోని న్యూ కాలనీలోని కసూర్బా విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ సీఈవో దాసరి వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలికా విద్య కోసం గురుకులాలను ఏర్పాటు చేసిందని, సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. అంతకు ముందు వి ద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీ లు నిర్వహిం చి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఎంపీడీవో సుశీల్‌ రెడ్డి, ఎస్‌వో స్వ ప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బెజ్జూర్‌ : బాలికలు విద్యతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని హార్టికల్చర్‌ ఈడీ రాథోడ్‌ శ్యాంరావ్‌ అన్నారు. శుక్రవారం కస్తూర్బా విద్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠ్య పుస్తకాల్లోని కార్యక్రమాలను నృత్యాలుగా, నటన చేశారు. ఎస్‌వో అమూల్య, సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది, విధ్యార్థులు పాల్గొన్నారు.logo
>>>>>>