బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 25, 2020 , 00:36:45

ప్రజా రవాణాలో డ్రైవర్లే కీలకం

ప్రజా రవాణాలో డ్రైవర్లే కీలకం
  • -ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ :  ప్రజా రవాణా లోడ్రైవర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  రాత్రి, పగలు తేడా లేకుండా నిబద్ధత తో విధులు నిర్వర్తిస్తారన్నారు. మేడారం జాతరకు ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి నుంచి ప్రత్యేక బ స్సులు నడపనున్నట్లు తెలిపారు. ఎంపీపీ మల్లికార్జున్‌ యాద వ్‌,డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి,అసిస్టెంట్‌ డిపోమేనేజర్‌ దేవపాల, నాయకులు ,డ్రైవర్లున్నారు.

పూలాజీబాబా ధ్యానమందిరం వార్షికోత్సవం

రెబ్బెన : మండలంలోని గంగాపూర్‌లోని సద్గురు శ్రీ పూలాజీబాబా ధ్యానమందిరం 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అత్రం సక్కు హాజరై కొబ్బరికా య కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పూలాజీబా బా మార్గంలో నడవాలని సూచించారు. రెబ్బె న ఎంపీపీ సౌం దర్య, జడ్పీటీసీ సంతోశ్‌, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, పీఎసీఎస్‌ వైస్‌ చై ర్మన్‌ వోల్వోజి వెంకటచారి, సర్పంచుల సం ఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, గంగాపూర్‌ సర్పంచ్‌ పందిర్ల వినోద, ఎంపీటీసీ వోల్వోజి హరిత, మాజీ సర్పంచ్‌ గంటుమేర, ముంజం రవీందర్‌, పూలాజీబాబా వారసులు కేశవరావు, కేంద్ర కమిటీ అధ్యక్షుడు సోమయ్య, నా యకులు నవీన్‌కుమార్‌జైస్వాల్‌, పందిర్ల మధునయ్య, జుమ్మిడి ఆనందరావు, గుర్లె చంద్ర య్య, అరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో నాగోబా పూజ

కెరమెరి: మండలంలో శుక్రవారం భక్తులు నాగదేవత పూజ చేశారు. యేటా పుష్యమాసం అమావాస్య రోజున కరంజివాడ, చాల్‌బాడి, మెట్టపీప్రీ గ్రామంలో సహజసిద్ధంగా వెలసిన పుట్టల వద్ద పూజలు చేయడం అనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో తరలివచ్చారు. కరంజివాడ(గోండ్‌గూడ) గ్రామంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆయా గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల వద్ద  పాలుపోసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా చాల్‌బాడిలో కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందించారు. అనంతరం నిర్వాహకులు కొరెంగ మారుబాయి గోవింద్‌రావ్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
logo
>>>>>>