ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Jan 25, 2020 , 00:32:25

సన్మార్గంలో నడవాలి

సన్మార్గంలో నడవాలి
  • - భంతే బుద్ధ శరణ్‌
  • - మండల కేంద్రంలో ర్యాలీ


బెజ్జూర్‌ : బుద్ధుడు బోధించిన ధమ్మ సూత్రాలను పాటిస్తూ సన్మార్గంలో నడుచుకోవాలని పూజ్య భంతే బధంత్‌ బిక్కు బుద్ధ శరణ్‌ చంద్రాపూర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బుద్ధ విహార్‌లో ఏర్పాటు చేసిన గృహస్త ఉపాసక్‌-ఉపాసిక బౌద్ధ ధమ్మ దీక్షా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రబోధించారు. ధమ్మ సూత్రలు పాటిస్తేనే విశ్వ శాంతి సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు స్థానిక అంబేడ్కర్‌ కమిటీ, బుద్ధ విహార్‌ కమిటీల ఆధ్వర్యంలో 15 రోజులుగా పరిత్రాన్‌ పాఠ్‌ పూజ కొనసాగిస్తూ శుక్రవారం సుమారు 50 మందికి  గృహస్త ఉపాసక-ఉపాసికలకు బౌద్ధ ధమ్మ దీక్షా ఇచ్చి ప్రబుద్ధులు గావించినారు. ఈ సందర్భంగా పంచశీల్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా గౌరవ అతిథులు కోనేరు ట్రస్ట్‌ అధ్యక్షుడు కోనేరు వంశీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అర్షద్‌ హుస్సేన్‌, పెద్దలు కుర్సింగ ఓంప్రకాశ్‌, సిడాం సకారాం, డోకె వెంకన్న లు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి అలంకరించారు. అనంతరం వంశీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ధమ్మ దీక్షా కార్యక్రమాలకు తనవంతూ సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. రాత్రి ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధమ్మ గురువులు బిక్కుని ఖేమా, సామ్నేరి సుభోధి పాలి బుద్ధ విహార్‌  బల్లార్ష, ఆల్‌ ఇండియా భిక్కు సంఘ్‌ ఉపాసక ఉసాసికల జిల్లా అధ్యక్షుడు దుర్గం జనార్దన్‌, ఉపాసక్‌లు దుర్గం మారుతి, గోమాసదేవాజీ, కొండగుర్ల మారుతి, లింగాల శంకరయ్య, సంజు వాన్ఖడె, బెజ్జూర్‌ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


logo