శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 23, 2020 , 23:45:15

ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి

ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి
  • -డయల్‌-100 వివరాలు నమోదు చేయాలి
  • -నేరాలపై కఠినంగా వ్యవహరించాలి
  • -విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలి
  • -అధికారుల సమీక్షలో ఎస్పీ మల్లారెడ్డి ఆదేశం
  • -పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేత


ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ యూఐ కేసులు, టీఐపీఎస్‌, పోలీస్‌ కస్టడీ, బెయిల్స్‌, పెండింగ్‌ వారెంట్లు అమలు చేయుట,నేరస్తుల గుర్తింపు , ఎల్‌అండ్‌వో, పీటీ కేసులు, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కన్వెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వలన్నారు. పీటీ కేసుల్లో పరీక్షలకు ముందు సాక్ష్యులను బ్రీఫింగ్‌ చేయడం, ఎఫ్‌ఐఆర్‌ తర్వాత నేరపరిశోధనలో పార్ట్‌ -2 లలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ మాత్రమే స్వయంగా రాత పూర్వకంగా వివరాలు నమోదు చేయాలన్నారు. డయల్‌ 100పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలన్నారు. అదేవిధంగా డయల్‌ 100 ఫిర్యాదులపై రెస్పాన్స్‌, క్లోజింగ్‌ సమయం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ఈ వివరాలను డీజీపీ సమీక్షిస్తారన్నారు. పీటీ కేసుల ద్వారా నేర తీవ్రత తగ్గించే వీలుంటుదనీ, చిన్న చిన్న నేరాలపై ఈ పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ప్రతి వర్టికల్‌ అధికారి వర్టికల్‌ నియమనిబంధనల మేరకు పని చేయాలని సూచించారు. తమ తమ పోలీస్‌ స్టేషన్‌ నందు 5ఎస్‌ పద్ధతిని తప్పకుండా పాటించాలన్నారు. రిసెప్షన్‌, బ్లూ కోర్ట్స్‌, పెట్రో కార్స్‌, కోర్టు డ్యూటీ, టీమ్‌ టీమ్‌, సెక్షన్‌ ఇన్‌చార్జి మొదలగు వర్టికల్‌పై అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.  ఆస్తి సంబంధిత నేరాలు, అక్రమ ఇసుక రవాణా, మహిళా సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాల చెకింగ్‌ చేస్తూ ,ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. కళా బృంద కార్యక్రమం, కమ్యూనిటీ పోలీసింగ్‌, నేను సైతం , షీ టీంల కార్యక్రమాల ద్వారా మూఢనమ్మకాలు, ఇతర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మంచిగ పని చేసిన పోలీస్‌ సిబ్బందికి, అధికారులకు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు సత్యనారాయణ, లక్ష్మీనరసింహమూర్తి, సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సెల్‌ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలకు గుర్తింపు...

పోలీస్‌శాఖలో మరింత ఉత్సాహన్ని నింపేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా జనవరిలో మెరుగైన సేవలు అందించిన సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేశారు. అందుకున్నవారిలో ఆసిఫాబాద్‌ ఎస్‌హెచ్‌వో మస్కా రాజు, కాగజ్‌నగర్‌ టౌన్‌ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, బెజ్జుర్‌ మహిళా కానిస్టేబుల్‌ సుచరిత, వాంకిడి కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, ఉద్దవ్‌, దహెగాం రాజకిరణ్‌, నరేందర్‌ కానిస్టేబుల్‌, జనార్దన్‌ నాయక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ జైనూన్‌ కానిస్టేబుల్‌, కాగజ్‌నగర్‌ రాజు, తిర్యాని యుగేందర్‌ ఉన్నారు.logo