గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 23, 2020 , 23:45:15

ప్రశాంతంగా ఏజెన్సీ టీఆర్‌టీ ఎస్‌జీటీ కౌన్సెలింగ్‌

ప్రశాంతంగా ఏజెన్సీ టీఆర్‌టీ ఎస్‌జీటీ కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌ రూరల్‌: ఉమ్మడి జిల్లాలో టీఆర్‌టీ 2017 ద్వారా ఎంపికైన 239 మంది ఎస్‌జీటీ అభ్యర్థులకు గురువారం ఆదిలాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థుల కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం డీఆర్‌వో నటరాజ్‌, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలించి కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ పత్రాలు అందజేశారు. టీఆర్‌టీ ద్వారా 230 మంది తెలుగు మీడియం ,9మందిని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని ఖాళీలు టీఆర్‌టీ ద్వారా భర్తీ అయ్యాయి. కొత్తగా చేరిన ఉపాధ్యాయులు శుక్రవారమే విధుల్లో చేరేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు కిరణ్‌ కుమార్‌, కిషన్‌ రెడ్డి, ఓపెన్‌స్కూల్‌ కోఆర్డినేటర్‌ అశోక్‌, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్లు సుధాకర్‌, సమీ, తుషార్‌, తదితరులు పాల్గొన్నారు.logo