సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 22, 2020 , 23:41:25

కన్నుల పండువలా బొమ్మల కొలువు

కన్నుల పండువలా బొమ్మల కొలువు
  • -శ్రీ కృష్ణుడి వేషధారణలో సేవా అధ్యక్షురాలు లక్ష్మీకుమారి కొండయ్య
  • -నృత్యాలతో మహిళల సందడి
  • -హాజరైన డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సతీమణి పద్మజాశంకర్‌


రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా గోలేటి క్లబ్‌లో బుధవారం లేడిస్‌ క్లబ్‌ గోలేటి అధ్యక్షురాలు లక్ష్మీకుమారికొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మలకొలువు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ప్రకృతిని ప్రేమించి ప్రకృతికి దగ్గరగా జీవించాలనే ఇతివృత్తంలో ఏర్పాటు చేసిన బొమ్మలు ఆకట్టుకున్నాయి. మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను తలపించేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఏరియా సేవా అధ్యక్షురాలు, లేడీస్‌క్లబ్‌ అధ్యక్షురాలు లక్ష్మీకుమారికొండయ్య శ్రీకృష్ణుడి వేషాధారణ అలంకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) పద్మజశంకర్‌ బొమ్మల కొలువును సుందరంగా తీర్చిదిద్దిన మహిళలను అభినందించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల జీఎంలు కొండయ్య, రమేశ్‌రావు, జీఎం సేఫ్టీ రీజీయన్‌ బళ్లారి శ్రీనివాస్‌, పర్సనల్‌ మేనేజర్‌ ఐ.లక్ష్మణ్‌రావు, డీవైపీఎం లోల్ల రామశాస్త్రి, వివిధ ఏరియాల లేడిస్‌క్లబ్‌ ప్రతినిధులు డాలి సంజయ్‌కుమార్‌, వల్లి పిచ్చయ్యశాస్త్రి, రేవతిగణపతి, సర

ళలక్ష్మీనారాయణ, శ్రీదేవిరమేశ్‌రావు, లక్ష్మీకుమారికొండయ్య, మాధవిశ్రీనివాస్‌, క్లబ్‌ కార్యదర్శులు లక్ష్మీశ్రీనివాస్‌, విజయతో పాటు గోలేటి లేడీస్‌ క్లబ్‌ మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.logo