మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 22, 2020 , 23:40:34

పల్లెల ప్రగతికి కృషి

పల్లెల ప్రగతికి కృషి
  • - అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలి
  • - ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  • - లింగాపూర్‌లో ట్రాక్టర్ల పంపిణీ
జైనూర్‌: పల్లెల ప్రగతికి  కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. బుధవారం లింగాపూర్‌ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్ఠిగా పని చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాలు విధించినప్పుడే అభివృద్ధి మరింత జరిగే అవకాశం ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పడిన లింగాపూర్‌ మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ భవనంతో పాటు మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత తీరుస్తామని చెప్పారు. ట్రాక్టర్లను పంచాయతీ అవసరాలకే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ  ఆడె సవిత ప్రేమ్‌,  మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఆడె ఆత్మారాం, జడ్పీటీసీ  లఖబాయి, ఎంపీడీవో శంకర్‌, తాసిల్దార్‌ మధూకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్‌కుమార్‌, ఎంపీటీసీ శోభాబలిరాం, సర్పంచులు ఉదయ్‌ లక్ష్మి, చిరంజీవి, మంగిబాయి కిషన్‌,  మనోహర్‌, రాథాబాయి, జ్యోతిరాం, నాయకులు గుణ్వంత్‌రావ్‌, లక్ష్మణ్‌, తదితరులున్నారు.logo
>>>>>>