శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 22, 2020 , 00:21:28

విధులనునిర్లక్ష్యం చేస్తే చర్యలు

విధులనునిర్లక్ష్యం చేస్తే చర్యలు
  • - జిల్లా అదనపు వైద్యాధికారి సుధాకర్‌ నాయక్‌
  • -తిర్యాణి, రోంపల్లి వైద్యశాలల తనిఖీ

తిర్యాణి: విధులను నిర్లక్ష్యం చేసే సిబ్బం దిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు వైద్యాధికారి, పల్స్‌ పోలియో ప్రో గ్రాం అధికారి సుధాకర్‌నాయక్‌ అన్నారు. మండలంలోని తిర్యాణి 30 పడకల, రోంపల్లి ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, దవాఖాన ఆవరణ, ల్యాబ్‌, పల్స్‌ పోలియో కార్యక్రమం, స్టాక్‌ రిజిస్టర్‌,  తదితర రికార్డులను పరిశీలించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ మండలంలో 3036 మంది ఐదేళ్లలోపు చిన్నారులు  ఉ న్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పోలియో చు క్కలు వేసి, విజయవంతం చేయడంపై సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినం దించారు.రోంపల్లి, తిర్యాణి, ఆర్‌బీఎస్‌కే, ఆయూష్‌, వైద్యాధికారులు మురళీధర్‌, శ్యాం, కౌటిల్య, శ్రీవాణి, స్పందన, రశీద్‌, ఉన్నారు.  logo