మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 22, 2020 , 00:19:30

ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఓటు హక్కును వినియోగించుకోవాలి


ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం

కాగజ్‌నగర్‌ టౌన్‌ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందు కోసం    జిల్లా సహాయ ఎన్నికల అధికారి , మున్సిపల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార వాహనం ఏర్పాటు చేశారు. మున్సిపాల్టీలోని 30 వార్డుల్లో ఈ వాహనం ద్వారా ప్రచారం నిర్వహించారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలని ప్రచారం చేశారు.


logo
>>>>>>