గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 20, 2020 , 23:43:21

ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌పై దృష్టి పెట్టాలి

ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌పై దృష్టి పెట్టాలి



అక్షరాస్యత పెంపునకు కృషి చేయాలి n పల్లె ప్రగతి పనులు వేగంగా పూర్తవ్వాలి
జిల్లా పరిషత్‌ సీఈవో వేణు n   ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంపీవోలతో సమీక్ష

-  అక్షరాస్యత పెంపునకు కృషి చేయాలి
-  పల్లె ప్రగతి పనులు వేగంగా పూర్తవ్వాలి
-  జిల్లా పరిషత్‌ సీఈవో వేణు
- ఆసిఫాబాద్‌లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంపీవోలతో సమీక్ష

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌పై దృష్టి సారించాలని జిల్లా పరిషత్‌ సీఈవో వేణు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రభుత్వం తీసుకవస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆక్షరాస్యతను పెంపొందించేందుకు చదువురాని వారికి చదువుకున్న వారు బాధ్యతగా వారికి విద్యను నేర్పించాలన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మురుగు కాలువలు, శ్మశానవాటిన, డంపిం గ్‌ యార్డు నిర్మాణ పనులు, నర్సరీల నిర్వహణ, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పనులు కూడా వేగంగా చేయాలని సూచించారు. ఈచ్‌వన్‌.. టీచ్‌వన్‌లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఏపీడీ వెంకట్‌, సూపరింటెండెంట్‌ తోటాజీ, ఎంపీడీవో శ్రీనివాస్‌, రమేశ్‌, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.



logo