బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 20, 2020 , 23:42:04

ఎన్నికలు పకడ్బందీగానిర్వహించాలి

ఎన్నికలు పకడ్బందీగానిర్వహించాలి
  • -సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి
  • -గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతించాలి
  • -ఉదయం ఏడింటికి పోలింగ్‌ ప్రారంభించాలి
  • -బూత్‌లలో ఏవైనా సమస్యలుంటే రిపోర్ట్‌ చేయాలి
  • -కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
  • -కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

కాగజ్‌నగర్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికలను ఈనెల 22న పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు సోమవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 63 పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకే ప్రారంభించాలని సూచించారు. నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రంలోని అనుమతించాలన్నారు. అనంతరం ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలనీ, సిబ్బందికి భోజన వసతికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని కమిషనర్‌ తిరుపతికి సూచించారు. జేసీ రాంబాబు, ట్రైనర్‌ శ్రీధర్‌ సుమన్‌, శ్రీనివాస్‌, పీవో ఏపీవోలు పాల్గొన్నారు.logo
>>>>>>