బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 20, 2020 , 02:22:37

రెండు చుక్కలతో చక్కని జీవితం

రెండు చుక్కలతో చక్కని జీవితం
  • -పిల్లలకు బాధ్యతగా మందు వేయించాలి
  • -ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
  • - డీఎంహెచ్‌వో కుమ్రం బాలుతో కలిసి పల్స్‌ పోలియో ప్రారంభం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రెండు చుక్కలే చిన్నారుల భవిష్యత్‌కు ముఖ్యమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద డీఎంహెచ్‌వో కుమ్రం బాలుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించకపోవడంతో ఎంతో మంది అంగవైకల్యానికి గురయ్యరన్నారు. ఎలాంటి అపొహాలు పెట్టుకోకుండా పిల్లలకు బాధ్యతగా మందు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సర్కారు దవాఖాన వద్ద జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, వివిధ ప్రాంతాల్లో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌ చుక్కలు వేశారు. రా ష్ట్ర పరిశీలకుడు సంజీవ్‌ రెడ్డి జిల్లాలోని ఈజ్‌గాంతో పాటు పలు గ్రామాల్లో పరిశీలించి పిల్లలకు చుక్కలు వేశారు. జిల్లాలో 54,642 మంది పిల్లలకు వేయాల్సి ఉండగా, మొదటి రోజు 53,150 మందికి చుక్కలు  వేశామనీ. దాదాపుగా 98 శాతం లక్ష్యం చేరినట్లు  డీఎంహెచ్‌వో బాలు తెలిపారు. మిగితా చిన్నారులకు సోమ,మంగళవారల్లో ఇంటింటికీ వెళ్లి సిబ్బంది చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, సత్యనారాయణ, సిబ్బంది సుబ్రహ్మణ్యం, కృష్ణ, దేవిదాస్‌, సంతోష్‌, భీమన్న, రవీంద్ర ప్రసాద్‌, శ్యాంలాల్‌, నాయకులు రామగౌడ్‌, సురేశ్‌ యాద్‌వ్‌, అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo