సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 20, 2020 , 02:20:10

నేటితో ప్రచారం సమాప్తం

నేటితో ప్రచారం సమాప్తం
  • - సాయంత్రం 5 గంటలకు ముగింపు
  • - వారం రోజులుగా ఉధృతంగా క్యాంపెయిన్‌
  • - అభ్యర్థులతో కలిసి గడప గడపకూ వెళ్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప
  • - ఇప్పటికే పలు వార్డుల్లో కలియదిరిగిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే సక్కు
  • - అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని విజ్ఞప్తి
  • - అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా వ్యూహ, ప్రతివ్యూహాలుకుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్‌ టౌన్‌:  మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనప్ప అన్నీ తానై ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇక ప్రచారం పూర్తి చేయడానికి సమయం సమీపిస్తుండడంతో  అభ్యర్థులు ప్రచార వేగం పెంచడంతో పాటు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు.

మొదటి నుంచే జోరుగా కారు..

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది మొదలు ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌ ప్రచారం ఆగలేదు. రోజు రోజుకూ మరింత విస్తృతం చేశారు. అభ్యర్థులు ప్రతి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారితో పాటు నేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా మున్సిపల్‌ పోరుకు ప్రాధాన్యత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలను క్లీన్‌స్వీప్‌ చేయాలనే అధినేత ఆలోచనల మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పోరులో ఉన్న అభ్యర్థులు అంతా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా తమ ప్రచారం సాగిస్తున్నారు. వాహనాలకు మైకులు కట్టి ప్రచారం చేయడంతో పాటు సోషల్‌ మీడియాను వినియోగించుకుంటున్నారు.

మిగతా పార్టీల్లో కనిపించని జోరు..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఎక్కడా కూడా మిగతా పార్టీల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఒకటి, రెండు చోట్ల పోటీ ఇస్తున్నప్పటికీ వారికంటే స్వతంత్రులు బలంగా ఉన్నారంటే ఆ పార్టీల పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో శ్రేణులు, అభ్యర్థులు ఆదిలోనే ఢీలా పడిపడ్డారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నీ తానై ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికక్కడా ద్వితీయ శ్రేణి నాయకులకు సూచనలు చేస్తూ, పార్టీ గెలుపునకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థు లు కూడా ఇంటింటికీ వెళ్లి రానున్న రోజుల్లో వారు చేపట్టే పనులను ఓటర్లకు వివరిస్తున్నారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి రెండ్రోజులు ప్రచారం నిర్వహించారు.logo