బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 19, 2020 , 00:55:04

గడప గడపకూ.. గులాబీ సైన్యం

గడప గడపకూ.. గులాబీ సైన్యం


ప్రచార పర్వంలో దూసుకుపోతున్న కారు

- అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప క్యాంపెయిన్‌  
- టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అడుగడుగునా బ్రహ్మరథం
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని విజ్ఞప్తి
- కనిపించని ప్రతిపక్షాల అభ్యర్థులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కాగజ్‌నగర్‌టౌన్‌ : మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఒక దఫా ప్రచారం పూర్తి చేసిన టీఆర్‌ఎస్‌.. నాలుగు రోజులుగా రెండో దఫా ప్రచారంలోకి దిగింది. నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారంలో హోరెత్తిస్తున్నా రు. రాజకీయ పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు గెలుపు కోసం గడప గడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముందుండి, ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని అభ్యర్థులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కి గతంలో చేసిన పనులను వివరిస్తూ, సంక్షేమమే ధ్యేయంగా మ రింత అభివృద్ధి చేయనున్నట్లు ఓటర్లకు వివరిస్తున్నారు.

జాబితా దగ్గర పెట్టుకుని..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీల నేతలు కదులుతున్నారు. ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకుని అందులో ఏ సామాజిక వర్గానికి ఎంత మంది ఉన్నారో లెక్కలు వేసుకుంటున్నారు. వర్గాలవారీగా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీల్లో వేరే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రహ్మరథం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులకు ఘనస్వాగతం లభిస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిత్యం ప్రజలతో ఉంటూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన తీరును వివరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుపుతున్నారు. ఇవే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పునాదులు కానున్నాయి. ఆసరా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగుల ఉపాధి కల్ప న కోసం పెద్ద ఎత్తున రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ ర్గాల పిల్లల చదువుల కోసం నూతన గురుకులాల ఏర్పాటుతోపా టు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఇక మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదోడి గడపకు నేరుగా చేరుతున్నా యి. అందుకే తమకు అంత ఆదరణ లభిస్తోందని టీఆర్‌ఎస్‌ నేత లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోనప్ప ప్రతి వార్డుకు వెళ్లి అభివృద్ధికి అండగా నిలుస్తానని హామీనిస్తుండడం అభ్య ర్థు లకు ప్రధాన బలంగా మారింది. ఇలా అందరి ఆదరణ లభిస్తుండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు సునాయసం కానుంది.

ఎవరికి వారే యమునా తీరే..

ప్రతిపక్షాల విషయానికి వస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు దిక్కూ, మొ క్కూ లేకుండా పోయింది. వరుసగా జరిగిన  ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి అందరూ బయటికి వెళ్లిపోయా రు. ఉన్న ఒక్కరు ఇద్దరు నేతలకు కూడా పార్టీలో ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏ ఎన్నికలు వచ్చినా జోరుగా దూసుకుపోయే కారును ఎవరూ అడ్డుకోలేరని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.



logo
>>>>>>