శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 19, 2020 , 00:51:54

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
  • -సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
  • -ఉదయం ఏడింటికే పోలింగ్‌ ప్రారంభించాలి
  • -సాయంత్రం ఐదు గంటల తర్వాత అనుమతించద్దు
  • -బూత్‌లలో ఏవైనా సమస్యలుంటే వెంటనే రిపోర్ట్‌ చేయాలి
  • -జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు
  • - ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

కాగజ్‌నగర్‌ రూరల్‌ : పట్టణంలో ఈ నెల 22న మున్సిపల్‌ పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు అన్నారు. ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల కు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పో లింగ్‌ రోజున ఓటర్లను గుర్తించడంలో ప్రిసైడింగ్‌ అధికారులు అప్ర మత్తంగా వ్యవహరించాలన్నారు. పట్టణంలో 63 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, 80 మంది ప్రిసైడింగ్‌, 80 మంది అసిస్టెంట్‌ ప్రిసై డింగ్‌ అధికారులు పకడ్బందీగా ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గు ర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని చెప్పారు. ఫారం -7కు బ్యాలెట్‌ పేపర్‌ సరిపోయిందా లేదా ముందుగా చూసుకోవాలన్నారు.. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లు డిమానిస్ట్రేషన్‌ పక్రియ పూర్తి చేయాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభిం చాల న్నారు. మార్క్‌ చేసిన ఓటరు జాబితా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావడానికి వీలులేదన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని తెలుపాలన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించవద్దని సూచించారు. పోలింగ్‌ బూత్‌ల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే రిపోర్ట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీధర్‌ సుమన్‌, శ్రీనివాస్‌, పీవో ఏపీవోలు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జేసీ రాంబాబు మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతికి జేసీ ఆదేశించారు. ఎస్‌కేఈ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ, సిబ్బందికి భోజన వసతి కల్పించాలని సూచించారు. కౌటింగ్‌ సమ యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
logo