శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 18, 2020 , 01:15:43

కెస్లాపూర్‌కు జాతర కళ

కెస్లాపూర్‌కు జాతర కళ
  • -ముమ్మరంగా సాగుతున్న పనులు
  • - పరిశీలించిన అధికారులు


ఇంద్రవెల్లి: కెస్లాపూర్‌కు జాతర కళ సంతరించుకున్నది. జారతను పురస్కరించుకొని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఉన్న నాగోబా ఆలయం వద్ద అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కెస్లాపూర్‌ నాగోబా  ఆలయ ఆవరణలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో బోర్‌వెల్స్‌కు మరమ్మతులతోపాటు విద్యుత్‌ వైర్ల ఏర్పాటు పనులు నిర్వహించారు. పాడైపోయిన విద్యుత్‌ మోటార్ల స్టార్టర్లను తొలగించి కొత్తవాటిని బిగించారు. నీటి ట్యాంకులను శుభ్రం చేసి నల్లాల వద్ద కొత్త కుళాయిలను ఏర్పాటు చేశారు. శాశ్వతంగా నిర్మించి ఉన్న మరుగుదొడ్ల ప్రాంతంలో వాటర్‌ ప్లాసింగ్‌ పనులు చేపట్టారు. దర్బార్‌ హాల్‌లో నిర్మిస్తున్న సీసీ నిర్మాణాల పనులను ఐటీడీఏ డీఈ తానాజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో తాత్కాలిక మరుగుదొడ్లతోపాటు స్నానపు గదుల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కెస్లాపూర్‌ గ్రామం నుంచి హర్కాపూర్‌ ఎక్స్‌రోడ్డు వరకు ఉన్న మట్టిరోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. మట్టిరోడ్డు మరమ్మతులను రెవెన్యూ అధికారులు దగ్గురుండి పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.logo