గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 16, 2020 , 23:36:23

కారు జోరు

కారు జోరు
  • - కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఊపందుకున్న ప్రచారం
  • - ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు
  • - వార్డుల్లో కలియదిరిగిన ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు
  • - అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపు
  • - కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మితే అధోగతే

కుమ్రంభీ ఆసిఫాబాద్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండగా, ఎమ్మెల్యేలు వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని వార్డుల్లో వేర్వేరుగా ప్రచారం చేశారు.

ఇంటింటికీ వెళ్తున్న అభ్యర్థులు

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలకు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మొదటి రోజు నుంచి అభ్యర్థులు ఓటర్ల ఇళ్లలోకి వెళ్తూ తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. గత ఐదేళ్లు గా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులు, విడుదల చేసిన నిధులను వివరిస్తూ ప్రచారం చేస్తు న్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ భవిష్యత్‌లో మరింత అభి వృద్ధి చెందాలంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటువేయాలని కోరుతున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో ఇంటింటికీ వెళ్తున్న అభ్యర్థులు అధికారి పార్టీని గెలిపిస్తే రాబోయే రోజుల్లో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

ప్రచార పర్వంలోకి ఎమ్మెల్యేలు

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృ ద్ధి సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా చేసుకొని మున్సిపల్‌ ఎ న్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మోసపూరిత వాగ్ధానాలను నమ్మొద్దనీ, అభివృ ద్ధే ధ్యేయంగా వెళ్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీనే ఆదరించాలని కోరారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్ది సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేలుగా తమపై ఉందనీ, టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయా లని పేర్కొన్నారు. సుమారు రూ. 50 కోట్లతో అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, ప్రతీ ఇంటికీ తాగునీటి వసతి, అర్హులకు పిం ఛన్లు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. మరోసారి పార్టీని ఆదరించాలని అభ్యర్థించారు.logo
>>>>>>