గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 16, 2020 , 23:32:43

సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం
  • - కారు గుర్తుకే ఓటేసి గెలిపించండి
  • - ఎమ్మెల్యే కోనప్ప, సక్కు
  • - కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో వార్డులో విస్తృత ప్రచారం

కాగజ్‌నగర్‌ టౌన్‌: సంక్షేమమే టీఆర్‌ఎ స్‌ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యేలు కోనేరు కో నప్ప, ఆత్రం సక్కు అన్నారు. పార్టీ అభ్య ర్థుల తరపున గురువారం ఇరువురు వార్డు ల్లో  ప్రచారం చేశారు. 8, 23 వార్డుల్లో ఎ మ్మెల్యే ఆత్రం సక్కు ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయా లని కోరారు. పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్ల కు వివరిస్తూ నమూనా బ్యాలెట్‌ను చూపించారు. 6,11,12,10 వార్డుల్లో  సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటింటా తిరుగుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని ప్రచారం చేశారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథ కాలను వివరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం విడుదల చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. మున్సి పాలిటీలో ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందనీ, అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిం చాలని కోరారు. పార్టీ నాయకులు బాలేశ్‌, మంగ, జాకీర్‌షరీఫ్‌, తదితరులున్నారు.logo
>>>>>>