శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 00:55:34

నేడే ఆఖరు

 నేడే ఆఖరు


కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటితో కీలక ఘట్టానికి తెరపడనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం గడువు ముగియనుండగా, ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది మంది ఉపసంహరించుకున్నా రు. ఇందులో ఆదివారం ఒకరు విత్‌డ్రా చేసుకోగా, సోమవారం ఏడు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించనుండగా, 30 వార్డులకు మొత్తంగా 186 నామినేషన్లు అందాయి. ఇందులో ఉపసంహరణకు మొదటి రోజు 26వ వార్డుకు చెందిన సిద్దం రాజేశ్వరి (స్వతంత్య్ర), రెండో రోజు సోమవారం 8వ వార్డు నుంచి సద్దాం హుస్సేన్‌ 2 నామినేషన్లు, వార్డు నంబర్‌ 3 నుంచి బొబ్బిలి అశోక్‌ 2, వార్డు నంబర్‌ 1లో వై విజయలక్ష్మి, 1, దేవయ్య ఒక నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు  మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటస్వామి తెలిపారు. దీంతో నామినేషన్ల సంఖ్య 178కి చేరింది.

నేటితో ముగియనున్న గడువు

ఈనెల 8 నుంచి 10 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించగా, 186 దాఖాలయ్యాయి. 11న పరిశీలించారు. 12వ తేదీ నుంచి 14 వరకు ఉపసంహరణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక ఉపసంహరణకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో, పోటీలో నిలిచిన వారిని బుజ్జగించే పనిలో ముఖ్యనాయకులు పడ్డారు. వార్డుల వారీగా తమ గెలుపునకు సహకరించిన అభ్యర్థులు, ఇతరులను కలుస్తూ వారిని విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నారు.

ఊపందుకోనున్న ప్రచార పర్వం

ఆయా వార్డుల్లో సమర్థులైన అభ్యర్థులకు పార్టీ భీఫాంలు అందివనున్నారు. దీంతో 30 వార్డుల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో నిలువనున్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు 15 తేదీ నుంచి ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఉపసంహరించుకున్న అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.logo