గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 00:55:05

గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి


ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘ నంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. సో మవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, శకటాలను ప్రదర్శించాలన్నారు. దీంతో పాటు జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారికి సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించాలన్నారు. ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుం డా చూడాలని ఆ శాఖ అధికారులను సూచించారు. అతిథుల, విద్యార్థులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో పాటు తాగునీటి సౌకర్య కల్పించాలని అదేశించారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏ ర్పాట్లన్నీ చేయాలని సంబంధిత అధికారులను అధేశించారు. జేసీ రాంబాబు, ఆర్డీవో సిడాం దత్తు, డీఆర్‌డీవో వెంకట శైలేష్‌, యువజన, క్రీడల అధికారి వెంకట్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రమణ, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు పూర్ణచందర్‌రావు, సత్యనారాయణ ఉన్నారు.


logo
>>>>>>