శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 00:54:17

పల్లెలను అభివృద్ధి చేస్తాం

పల్లెలను అభివృద్ధి చేస్తాం


ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ :  పల్లెల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మె ల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం బాబాపూర్‌ గ్రామంలో డ్రైనే జీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నర్సరీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామనీ, ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛతగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా తడి ,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సక్కును సర్పంచ్‌ అధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌, సర్పంచ్‌ చునార్కార్‌ లక్ష్మి, ఎంపీడీవో రమేశ్‌, ఉప సర్పంచ్‌ లీలాబా యి, నాయకులు చంద్రయ్య, కిష్టయ్య, బిజ్జు, వార్డు సభ్యులు రాజన్న, పత్రు, లహాను, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo