బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 14, 2020 , 00:53:26

పారదర్శకంగా టికెట్ల కేటాయింపు

పారదర్శకంగా టికెట్ల కేటాయింపు
  • - ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌


చెన్నూర్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీ ఎన్నికల్లో పారదర్శకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లను కేటాయించడం జరిగిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో నాయకులు కొంత మంది నాయకుల చేతిలోనే టికెట్లను పెట్టెవారని, దీంతో వారు అర్ధరాత్రి వారి అనుమాయులకు టికెట్లను కే టాయించే వారని తెలిపారు. అందుకు భిన్నంగా సో మవారం టికెట్లను కేటాయించటం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యంలో పాల్గొన్న వారికి తప్పకుండా ఆరు టికెట్లను ఇస్తామని గతంలో అనేక సార్లు చె ప్పానని, కానీ.. ప్రస్తుతం ఉద్యమ కారులకు న్యా యం చేయాలని ఎనిమిది టికెట్లను కేటాయించటం జరిగిందన్నారు. టికెట్ల కేటాయింపులో యువతకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పని చేసి చెన్నూర్‌ మున్సిపాలిటీలో మొత్తం వార్డు ల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మహవాది సుధాకర్‌రావు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

చెన్నూర్‌ బల్దియాలో ‘టీఆర్‌ఎస్‌' బోణి

చెన్నూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బోణీ కొట్టింది. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించు కోవడంతో నాలుగు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఒక్క రోజు గడువు ఉండగానే చెన్నూర్‌ మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో నాలుగు వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవ సం చేసుకుంది. 10వ వార్డులోని బీజేపీ అభ్యర్థులు కొమ్మెర శ్రీలత, బొడ్డు సుజాతలు తమ నా మినేషన్లను ఉప సంహరించుకోవటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి అర్చన గిల్డా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. 11వ వార్డులో బీజేపీ వేల్పుల రవళి తమ నా మినేషన్‌ను ఉప సం హరించు కోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెండ్యాల స్వర్ణలత.. 13వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఈర్ల నారాయణ, ఎండీ అన్వర్‌, బీజేపీ అభ్యర్థి నయీమొద్దీన్‌, స్వతంత్ర అభ్యర్థులు దాసరి సందీ ప్‌, మాసు జయలు తమ నామినేషన్లను ఉప సం హరించుకోవటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అ భ్యర్థి నవాజొద్దీన్‌.. 14వ వార్డులో బీజేపీ అభ్యర్థి సింగిడి ప్రే మలత, టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థి మేడ సుశీల లు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మేడ స్రవంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పలువురు ఉపసంహరణ

మున్సిపాలిటీలోని 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు చెన్న చంద్రమోహన్‌, చెన్న శ్రీకాంత్‌, సుంకరి అనిల్‌, 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థి ఈర్ల భాగ్యలక్ష్మి, 8వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థులు బి బాలగౌడ్‌, గడ్డం మల్లయ్య, 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థి అంకారి హరిబాబు, ఏఐఎంఐఎం అభ్యర్థి సయ్యద్‌ జమాలొద్దీన్‌, 12వ వార్డులో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి హామీదా బేగం షేక్‌, స్వతంత్ర అభ్యర్థులు మోసీనా తబుసం, చకినారపు సావిత్రి, 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థి గంధం రమేష్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ డమ్మి అభ్యర్థులు నిమ్మల శిరీష, పాయిరాల మల్లీశ్వరీ, స్వాతంత్ర అభ్యర్థి జరినా ఫాతిమాలు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. ఇంకా ఒక్క రోజు నామినేషన్లకు ఉప సంహరణకు గడువు ఉండటంతో మరి కొంత మంది టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 

క్యాతనపల్లిలో 11 మంది

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 169 మంది నామినేషన్లు వేయగా ఇందులో 11 మంది సోమ వారం విత్‌డ్రా చేసుకున్నారు. రెండో  వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కాంపెల్లి దేవదా స్‌, మూడో వార్డులో సీపీఐ అభ్యర్థి రెజ్వానా భేగం, ఎనిమిదో వార్డులో సీపీఐ అభ్యర్థి ఆకుల ప్రమీల, 12లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలంపల్లి స్వరూప, స్వ తంత్ర అభ్యర్థి మాతగిరి సంతోష, 19వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గాజుల భాగ్యలక్ష్మి, గాజుల మాధవి, 20వ వార్డులో కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన గోపు రాజం, 21వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోల భాగ్యలక్ష్మి తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నారు. 14వ తేదీ వరకు విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మండలాధ్యక్షుడు గోపు రాజం సోమ వారం ప్రభుత్వ విఫ్‌ బాల్క సుమన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.



logo