ఆదివారం 24 మే 2020
Komarambheem - Jan 14, 2020 , 00:51:14

బీ-ఫారాల పంపిణీ

బీ-ఫారాల పంపిణీ


చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : చెన్నూర్‌ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ బీ-ఫారాలు పంపిణీ చేశారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అభ్యర్థులకు ఆయ న అందించారు. 1వ వార్డులో వీర్లమల్ల రాంమోహన్‌, 2వ వార్డులో కమ్మల శ్రీనివాస్‌, 3వ వా ర్డులో వేల్పుల సుధాకర్‌, 4వ వార్డులో రేవెల్లి మ హేశ్‌, 6వ వార్డులో సాధనబోయిన లావణ్య, 7వ వార్డులో జగన్నాథుల శ్రీను, 8వ వార్డులో అట్టెం రాజబాపు, 9వ వార్డులో దోమకొండ అనిల్‌, 10వ వార్డులో అర్చనగిల్డా, 11వ వార్డులో పెం డ్యాల స్వర్ణలత, 12వ వార్డులో వేముల శారద, 13వ వార్డులో నవాజొద్దీన్‌, 14వ వార్డులో మేడ స్రవంతి, 15వ వార్డులో జాడి సురేఖ, 16వ వార్డులో తుమ్మ రమేశ్‌, 17వ వార్డులో నాయిని శ్యామల, 18వ వార్డులో గరెపల్లి శాంతరాణిలకు టీఆర్‌ఎస్‌ పార్టీ బీ-ఫారాలు  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమా ర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మహావాది సుధాకర్‌రావు పాల్గొన్నారు.

లక్షెట్టిపేటలో..

లక్షెట్టిపేట: మున్సిపాలిటీలోని 15 వార్డులకు సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి ది వాకర్‌ రావు టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల బీ ఫారం లిస్టును రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఒకటో వార్డు అభ్యర్థిగా లావుడ్య సురేశ్‌, రెండో వార్డు అభ్యర్థిగా ----, మూడో వార్డుకు పెట్టం తిరుపతి, నాలుగుకు సాయిని సుధాకర్‌, ఐదుకు పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, ఆరుకు శాతరాజు రాజన్న, ఏడుకు అంకతి భాగ్యలక్ష్మి, ఎనిమిదికి రాందేని తిరుపతి, తొమ్మి దికి ఓరుగంటి శ్రీకాంత్‌, పదికి గరిసె కవిత, 11వ వార్డు అభ్యర్థిగా నల్మాసు కాంతయ్య, 12కు గడికొప్పుల వజ్ర, 13కు మెట్టు కళ్యాణి, 14కు  నడిమెట్ల కళావతి, 15వ వార్డు అభ్యర్థిగా శభానా భేగంలకు టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బీ ఫారంలు అందజేశారు.


logo