గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 13, 2020 , 01:13:30

ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం..

ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం..


- జిల్లాలో ఊరూరా గ్రామసభలు
- రెండో విడుత పల్లె ప్రగతి విజయవంతంపై హర్షం  
- పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై చర్చ
- అభివృద్ధి పనుల పూర్తికి ఆయా చోట్ల తీర్మానాలు 
- స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ
- పలువురికి ఘన సన్మానం
- పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు

నమస్తే నెట్‌వర్క్‌:  జిల్లాలో రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో కొనసాగిసింది. ఆఖరి రోజు ఊరూరా గ్రామ సభలు నిర్వహించగా, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు నిర్ణయించారు. పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై చర్చించి, ఆయా చోట్ల చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు. పలు గ్రామాల్లో చెత్త బుట్టలను అందజేయగా, స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారిని ఘనంగా సన్మానించడంతో పాటు రానున్న రోజుల్లో ఇదే చొరవ చూపాలని సూచించారు. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడలో గ్రామసభకు జేసీ రాంబాబు హాజరై, కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు.                                       

జిల్లావ్యాప్తంగా పల్లెప్రగతి ముగిసింది. ఆదివారం చివరిరోజు  సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టాల్సిన  అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికే తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి చేపట్టిందనీ, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ మరింత అభివృద్ధి చేసుకుందామని వారు పిలుపునిచ్చారు.  పలు గ్రామాల్లో ప్రజలకు చెత్త బుట్టలు పంపిణీ చేసి స్వచ్ఛతకు పాటుపడతామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు, దాతలను సన్మానించారు. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడలో గ్రామసభకు జేసీ రాంబాబు హాజరై  చేసిన పనులను అడిగి తెలుసుకున్నారు.


logo