బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 13, 2020 , 01:12:47

రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం

రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాంవాంకిడి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని చిన్నవాంకిడి గ్రామ సమీపంలోని కుమ్రం భీం ప్రధాన కాలువకు గండిపడి ఆరు నెలల నుంచి నీరు వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో పాటు గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జడ్పీటీసీ ఆదివారం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రధాన కాలువకు నీరు వృథాపోకుండా మరమ్మతులు చేయించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట బంబార మాజీ ఎంపీటీసీ వినోద్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ పెంటు, నాయకులు వనపర్తి సదాశివ్‌, తదితరులు ఉన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని  జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో డైలీ క్రికెట్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్‌ పోటీలను జడ్పీటీసీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పోటీలను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండే తుకారాం, ఉపసర్పంచ్‌ కే పవన్‌సాయి, నిర్వాహకులు పిప్పిరి మహేశ్‌, రాకేశ్‌, సంతోశ్‌, దిలీప్‌, సాయినాథ్‌, సోను, అహ్మద్‌, సాయి, అష్షు, మహేశ్‌, దుర్గం సందీప్‌, దయాకర్‌ పాల్గొన్నారు.


logo