సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 13, 2020 , 01:12:07

చలి @ 6.2 డిగ్రీలు

చలి @ 6.2 డిగ్రీలు


ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ :  జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  వారం రోజులుగా సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు రెండురోజులుగా ఒకేసారి పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో  28 డిగ్రీల గరిష్ఠం కాగా,  కనిష్ఠంగా 6.2 డిగ్రీల న మోదయ్యింది.  సాయంత్రం 6 అయిందంటే చాలు మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు చలితో ప్రజలు జంకుతున్నారు. దీంతో పాటు పొగమంచుతో ఇబ్బందులు తప్పడం లేదు. చలి తీవ్రత పెరిగిందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

కేసు నమోదు చేయాలి

జైనూర్‌: ఆర్డీవో సిడాం దత్తును కులం పేరుతో దూషించిన మల్లేశ్‌పై వెంటనే శా ఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు కుం రం శంకర్‌ కోరారు. ఆదివారం ఆయా సంఘాల నాయకులతో కలిసి విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లేశ్‌ అనే గిరిజనేతరుడు ఆర్డీవోను కులం పేరు తో దూషించడం సరికాదనీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో ఆయా ఆదివాసీ సంఘాల నాయకులు గొడం జంగుబాయి, కొడప మొతుబాయి, కుస్రం నీలకంట్‌, మడావి శ్రీనివాస్‌, తలండి లక్ష్మణ్‌, కొట్నక్‌ మొహపత్‌రావ్‌, మడావి మనోహార్‌ తదితరులున్నారు.

సన్మానం

బెజ్జూర్‌ : మండలంలోని లుంబినీనగర్‌ గ్రామానికి చెందిన నీలం రవితేజ ఇంటర్‌ సొసైటీ లీగ్‌ పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇతను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 400,100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇంతకుముందు జిల్లా స్థాయి నుంచి నెగ్గి సిల్వర్‌ మెడల్‌ కూడా సాధించినట్లు రవితేజ తెలిపాడు. కాగా ఇటీవల సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి రాగా ఆదివారం రవితేజను  గ్రామస్తులు అతని తల్లిదండ్రులు సన్మానించారు. స్వేరో సర్కిల్‌ సభ్యులు, అంబేద్కర్‌ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.logo