సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 13, 2020 , 01:09:58

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద


మంచిర్యాల అగ్రికల్చర్‌ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ వై సురేందర్‌రావు పేర్కొన్నారు. ఆదివా రం జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో డీవైఎస్‌ఓ కార్యాలయ ఆవరణలో యువజన క్రీడల శా ఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జేసీ మాట్లాడారు. యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని అందరికి ఆదర్శంగా నిలువాల ని కోరారు. దేశంలో యువత శాతం ఎక్కువగా ఉం దనీ, ప్రభుత్వానికి సహకరిస్తూ సేవా కార్యక్రమాల ను కొనసాగించాలని సూచించారు. ప్లాస్టిక్‌ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుదామనీ, ప్లాస్టిక్‌ రహిత తెలంగాణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ యువత, సేవ, స్వచ్ఛంద సంఘాల అధ్యక్షులను సన్మానించి జ్ఞాపి క, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భం గా సుహాసిని చౌహాన్‌ చేసిన భరతనాట్యం, అకిరా చేసిన రక్తదానంపై అవగాహన నృత్యం ఆకట్టుకున్నాయి. అంతకు ముందు వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన సం ఘాల కన్వీనర్‌ అభినవ సంతోష్‌ కుమార్‌, యువతరం తిరుపతి, మేము సైతం శ్రీనివాస్‌, సామాజిక జాగృ తి సరిత, రోజా, ఆదర్శ మహిళా సొసైటీ విజయ, ఫ్రెండ్స్‌ అనిమల్‌ ట్రస్ట్‌ సందేశ్‌, వెలుగు ఫౌండేషన్‌ రాంప్రకాశ్‌, ముల్కల కుమార్‌, యువజన సంఘా ల సభ్యులు, పాల్గొన్నారు.


logo