బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 13, 2020 , 01:07:12

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి


బెల్లంపల్లిటౌన్‌ : క్రీడాపోటీల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య పేర్కొన్నారు. అరుణ్‌ మెమోరియల్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏఎంసీ గ్రౌండ్‌లో ఆదివారం జిల్లా స్థ్ధాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. తానూ రి అరుణ్‌ స్మారకార్ధం నిర్వహిస్తున్న పోటీలకు ము ఖ్య అతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యా రు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా చదువుతో పాటు గా క్రీడలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గడ్డం వివేక్‌, క్రికెట్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మునిమంద రమేశ్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మునిమంద స్వరూప, నాయకులు అడిచెర్ల రాంచందర్‌, సబ్బని రాజనర్సు, మాదిరి రాకేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>