సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Jan 12, 2020 , 05:59:41

డార్ఫ్‌ దంపతులకు ఘన నివాళి

డార్ఫ్‌ దంపతులకు ఘన నివాళి
  • మార్లవాయిలో 33వ వర్ధంతి
  • ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

జైనూర్‌: ఆదివాసుల వెలుగు దివ్వెలు ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ బెట్టి ఎ లిజబెత్‌ దంపతుల వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఐటీడీఏ పీవో కృష్ణాది త్య, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ అధ్యక్షు రాలు కోవలక్ష్మితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డార్ఫ్‌ దంపతుల ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముం దుగా గ్రామపటేల్‌ ఇంటి నుంచి డార్ఫ్‌ దంపతుల సమాధుల వరకు డ ప్పు వాయిద్యాల నడుమ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఘన స్వాగతం పలికారు. సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అ నం తరం డార్ఫ్‌ విగ్రహాల వద్ద చేరుకుని అక్కడ విగ్రహాలకు పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఆదివాసులు కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ... ఆదివాసు లు విద్యా రంగంలో ఉన్నత స్థానాల్లో రాణించాలనీ, విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆదివాసులు విద్య, వై ద్యం, వ్యవసాయంపై దృష్టి సారిస్తూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రభు త్వం ద్వారా ఆదివాసులకు సదుపాయల కల్పనకు కృషిచేస్తున్నట్లు చె ప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్‌ లక్కేరావు, జిల్లా గ్రంథా లయ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, ఆదిలాబాద్‌ జిల్లా పీసా కోఆర్డినేటర్‌ వెడ్మ భోజ్జు, డీటీడీవో దిలీప్‌కుమార్‌ ఆదివాసీ  నాయకులు ధుందేరావ్‌, కనక వెంకటేశ్వర్‌రావ్‌, సుగుణ, దేవేందర్‌, అర్జు,  దుర్గు, తదితరులున్నారు.logo